Skip to main content

Namaste NRI

స్విట్జర్లాండ్‌లో బతుకమ్మ పోస్టర్‌ను ఆవిష్కరించిన మండలి చైర్మన్, సభాపతి

విదేశాల్లో స్థిరపడినప్పటికీ మాతృభాషను, సంస్కృతి సంప్రదాయాలను మరువకుండా కాపాడుతుండటం అందరూ హర్షించదగ్గ విషయమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బతుకమ్మ, బోనాలు వంటి ఉత్సవాలను నిర్వహిస్తూ భాషా సంస్కృతిని స్విట్జర్లాండ్‌లో ఇనుమడింపజేయడం భావితరాలకు ఆదర్శమన్నారు.

కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన విదేశీ అధ్యయన పర్యటనలో భాగంగా తెలంగాణ శాసన వ్యవస్థ ప్రతినిధుల బృందం స్విట్జర్లాండ్‌లోని బెర్న్ సిటీలో పర్యటించింది.ఈ సందర్భంగా స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్ అధికారిక వెబ్‌సైట్ ను, ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు.

స్విట్జర్లాండ్‌లో నిర్మించబోయే వేంకటేశ్వరస్వామి దేవాలయం గురించి అక్కడి తెలుగు సంఘం ప్రతినిధులు వివరించారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, శాసనసభ కార్యదర్శి రెండ్ల తిరుపతి, శాసనమండలి కార్యదర్శి నరసింహాచార్యులు, స్విట్జర్లాండ్ తెలుగు సంఘం అధ్యక్షుడు కిరణ్ వేదాంతం, కార్యదర్శి హరిప్రసాద్ పాల్గొన్నారు.

అంతకుముందు బెర్న్ సిటీలో ఉన్న చారిత్రాత్మక పార్లమెంట్ భవనాన్ని తెలంగాణ శాసన వ్యవస్థ బృందం సందర్శించింది. స్విట్జర్లాండ్ పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజాస్వామ్య సంప్రదాయాలు, శాసనసభల పనితీరు, చట్లా రూపకల్పన విధానాలు, ప్రజా ప్రతినిధుల బాధ్యతలు వంటి అంశాలపై చర్చించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events