Skip to main content

Namaste NRI

కెనడా మేయర్ బరిలో తెలుగు మహిళ

తెలంగాణ సంతతికి చెందిన దీపికా దామెర్ల కెనడాలోని మిసిసౌగా మేయర్ పదవికి పోటీచేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి దీపిక వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. హిందీ పాట క్యా హువా తేరా వాదా స్టైల్‌లో ఓటర్లకు ఆమె హామీలు ఇస్తున్నారు. ఆ పాట తరహాలో పేరడీ చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తనను మిసిసౌగా మేయర్‌గా గెలిపిస్తే ఏమేం చేస్తానో వివరిస్తూ పలు హామీలు ఇచ్చారు. మిసిసౌగా మేయర్ పదవికి పోటీచేస్తున్న నన్ను గెలిపించండి. నేను మేయర్‌గా ఎన్నికైతే ప్రాపర్టీ ట్యాక్స్ పెంచను. ఆ పన్ను పెరగకుండా చూస్తాను. దయచేసి నాకు మద్దతు తెలిపి మేయర్‌గా గెలిపించండి.

దీపికా దామెర్ల తెలంగాణలో సికింద్రాబాద్‌లో జన్మించారు. తర్వాత ఆమె కుటుంబం కెనడాకు వలస వెళ్లింది. టొరంటో యూనివర్సిటీలో రోట్‌మన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఆమె ఎంబీఏ ఫైనాన్స్ పూర్తి చేశారు. ఎంబీఏ పూర్తిచేసిన తర్వాత కార్పొరేట్ బ్యాంకింగ్ రంగంలో కొంతకాలం పనిచేశారు. మిసిసౌగాలోనే ఓ వ్యాపారం కూడా నడిపారు. తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2018లో మిసిసౌగా సిటీ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. సిటీలోని ఏడో వార్డుకు ప్రాతినిధ్యం వహించారు. ఆ నగరంలో ఆమె దీర్ఘకాలంగా కమ్యూనిటీ లీడర్‌గానూ వ్యవహరించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events