నటుడు సునీల్ లాయర్గా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. డ్యూ డేట్ సినిమాలో సునీల్ ఈ పాత్రను పోషిస్తున్నారు. లోమేష్ పుడిపెద్ది హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆనంద్ కె దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ తరిగోపుల, ఏలూరు శ్రీను నిర్మాతలు.

ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుగుతున్నది. నేటి సమాజంలోని ఓ బర్నింగ్ ఇష్యూని కథా వస్తువుగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, కోర్ట్రూమ్ డ్రామాగా ఆకట్టుకుంటుందని, సునీల్ పాత్ర కథాగమంనలో కీలకంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. జయశ్రీ, ప్రణీత పట్నాయక్, కృష్ణభగవాన్ తదితరులు చిత్ర తారాగణం.















