అమెరికాలోని ఒక యూనివర్సిటీలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఓ 21 ఏండ్ల యువతిపై లైంగిక దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురు నిందితులు ఉన్నారు. బాధితురాలిపై బాత్రూమ్లో లైంగిక దాడి జరుగుతున్న సమయంలో మిగిలిన నిందితులు బయట ఉండి కేరింతలు కొడుతూ తమ వంతు కోసం వేచి ఉండటం అత్యంత దిగ్భ్రాంతికరంగా మారింది.

షికాగో విశ్వవిద్యాలయం సమీపంలోని ఒక ఫ్రెటర్నిటీ పార్టీలో ఒక మహిళకు సంబంధించిన కేసును షికాగో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాత్రూమ్ బయట గుమికూడిన పలువురు పురుషులు కేరింతలు కొడుతూ, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తుండగా ఆ మహిళ లైంగిక దాడికి గురైంది. ఆ మహిళ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థిని కాదని పోలీసులు ధృవీకరించారు.















