వెనిజువెలా దేశ ప్రతిపక్ష నాయకురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా కొరినా మచాడో దాదాపు ఒక ఏడాది తర్వాత తన స్వదేశానికి చేరుకున్నారు. అరెస్ట్ భయంతో కొంతకాలం పాటు అజ్ఞాతంలోనే గడిపిన ఆమె గతంలో నోబెల్ బహుమతిని స్వీకరించేందుకు దేశం విడిచి వెళ్లారు. ఆదివారం ఆమె తిరిగి వెనెజువెలాకు చేరుకున్నట్లు ఆమె ప్రతినిధి డేవిడ్ సోమోలాన్సీ తెలిపారు.

పశ్చిమ వెనెజువెలాలోని లారా స్టేట్లోని ఒక చర్చిలో ఆమె ఉన్న ఫొటోలను పార్టీ విడుదల చేయగా, నేను ఇక్కడ ఉన్నాను. మీ అందరితో ఉన్నాను అంటూ ఆమె ఎక్స్ వేదికగా తన రాకను ప్రకటించారు. మచాడో స్వదేశానికి తిరిగి రావడాన్ని దేశంలో ప్రజాస్వామ్య పరివర్తనకు, స్వేచ్ఛాయుత, పారదర్శక అధ్యక్ష ఎన్నికలకు ఒక ముందడుగుగా ఆమె ప్రతినిధి అభివర్ణించారు.















