Skip to main content

Namaste NRI

ఇలాంటి హారర్ సినిమా ఈ మధ్య రాలేదు

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేకర్స్‌ నిర్మించిన ఇంటెన్స్‌ హారర్‌ థ్రిల్లర్‌ 418. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి కీర్తన్‌ నాదగౌడ దర్శకుడు. చైత్ర ఆచార్‌, సూర్యరాజ్‌, చరణ్‌ లక్కరాజు, ప్రీతి పగడాల, శశాంక్‌ పాటిల్‌ కీలకపాత్రధారులు. ఇటీవలే విడుదలైన ఈచిత్రం థియేటర్‌లో ప్రదర్శితమవుతున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ నిర్వహించారు.

తమ సంస్థ నుంచి వచ్చిన తొలి హారర్‌ థ్రిల్లర్‌ ఇదని, యంగ్‌ టీమ్‌తో చేసిన ఈ సినిమా విజయాన్ని సాధించడం ఆనందంగా ఉందని, దర్శకుడు కీర్తన్‌ ఎంత గొప్పగా స్టోరీ రాశాడో, అంతకంటే గొప్పగా తెరకెక్కించాడని, టెక్నికల్‌గా ఈ సినిమా ఓ అద్భుతమని నిర్మాతలు నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ అన్నారు. ఆడియన్స్‌కి గొప్ప అనుభూతిని అందిస్తున్న ఈ సినిమాకు సౌండ్‌ డిజైన్‌ ప్రధాన బలమని దర్శకుడు కీర్తన్‌ నాదగౌడ చెప్పారు. ఇంకా నటీనటులు ప్రీతి పగడాల, చరణ్‌ లక్కరాజు, మైత్రీ శశిధర్‌రెడ్డి, సౌండ్‌ డిజైనర్‌ అనుపమ్‌, సంగీత దర్శకుడు వెంకీ జీజీ కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events