Skip to main content

Namaste NRI

సూర్య, నజ్రియా నజీమ్‌ సీన్‌ ట్రైలర్‌ వచ్చేసింది

తమిళ అగ్ర హీరో సూర్య పోలీస్‌ పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సీన్‌. జీతూ మాధవన్‌ దర్శకత్వం. ఈ యాక్షన్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నజ్రియా నజీమ్‌ కథానాయికగా నటిస్తున్నది. జ్యోతిక, సూర్య నిర్మిస్తున్న ఈ సినిమా దీపావళి సందర్భంగా ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకురానుంది. తెలుగు రాష్ర్టాల్లో ఎన్వీఆర్‌ సినిమా రిలీజ్‌ చేస్తున్నది. ఆదివారం ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఇందులో డీఎస్పీ ప్రేమ్‌రాజ్‌ పాత్రలో సూర్య కనిపించారు. ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటాడు ప్రేమ్‌రాజ్‌. అయితే ఓ ప్రమాదకరమైన క్రిమినల్‌ కేసు ఆయన్ని తిరిగి రంగంలోకి దిగేలా చేస్తుంది. క్రూరుడైన విలన్‌ని పట్టుకునే క్రమంలో ప్రేమ్‌రాజ్‌ చేసే సాహసాలు, ఆయనకు ఎదురైన సవాళ్ల నేపథ్యంలో ట్రైలర్‌ ఉత్కంఠను పంచింది. యాక్షన్‌, కామెడీ అంశాల్ని మేళవిస్తూ ఇన్వెస్టిగేటివ్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఈ చిత్రానికి సుశిన్‌ శ్యామ్‌ సంగీతాన్నందించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events