Skip to main content

Namaste NRI

అందుకే ఈ సినిమా నా కెరీర్‌లోనే ప్రత్యేకం : సాయిరాజేష్‌

సంపూర్ణేష్‌ బాబు హీరోగా నటించిన కొబ్బరిమట్ట చిత్రం చక్కటి వినోదంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సాయిరాజేష్‌ రచన, నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెల 14న రీరిలీజ్‌ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సాయిరాజేష్‌ మాట్లాడుతూ కొబ్బరిమట్ విజయం నిర్మాతగా నాలో ధైర్యాన్నినింపింది. ఇండస్ట్రీ లో మరిన్ని సినిమాలు చేయొచ్చనే నమ్మకాన్నిచ్చింది.అందుకే ఈ సినిమా నా కెరీర్‌లోనే ప్రత్యేకం. ఈ సినిమా రైటింగ్‌పరంగా అనేక ప్రయోగాలు చేశాం. రెండుమూడు నిమిషాల నాన్‌స్టాప్‌ డైలాగ్స్‌ని సంపూర్ణేష్‌బాబు అద్భుతంగా చెప్పాడు. ఇప్పటికీ సోషల్‌మీడియాలో ఆ డైలాగ్స్‌ వైరల్‌ అవుతుంటాయి. ప్రేక్షకుల్ని మరోమారు నవ్వించాలనే ఉద్దేశ్యంతో రీరిలీజ్‌ చేస్తున్నాం అన్నారు.

ఈ సినిమాలో తాను మూడు విభిన్న పాత్రల్లో నటించానని, ఇప్పటికీ ప్రేక్షకులు ఫోన్‌ చేసి కొబ్బరిమట్ట తమకు ఇష్టమైన సినిమా అని చెబుతుండటం సంతోషంగా అనిపిస్తుందని సంపూర్ణేష్‌బాబు అన్నారు. ఈ చిత్రంలో ఇషికాసింగ్‌, గీతాంజలి, షకీలా కీలక పాత్రల్లో నటించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events