అక్కినేని నాగచైతన్య హీరోగా రూపొందుతున్న మైథలాజికల్ థ్రిల్లర్ వృషకర్మ.మీనాక్షి చౌదరి కథానాయిక. కార్తీక్ దండు దర్శకుడు. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్.బి నిర్మాతలు.ఈ చిత్రంలో స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా ప్రచారాన్ని మేకర్స్ వేగవంతం చేశారు. ఈ సినిమా నుంచి స్వాగ్ ఆఫ్ అర్జున్ ఫస్ట్ సింగిల్‌ని మేకర్స్ విడుదల చేశారు.

ఈ సినిమాలో నాగచైతన్య నటిస్తున్న ట్రెజర్ హంటర్ అర్జున్ పాత్రను ఈ పాట పరిచయం చేసింది. ైస్టెల్, ఆటిట్యూడ్, ఎనర్జీతో అసాధారణమైన సాహసయాత్రకు సిద్ధమవుతున్న ట్రెజర్ హంటర్‌గా ఈ పాటలో చైతూ కనిపించారు. కథానాయకుడి స్వాగ్నీ, ఆటిట్యూడ్‌ను ఆవిష్కరిస్తూ అభినవకవి రాసిన ఈ పాటను బి.అజనీష్ లోక్‌నాథ్ ట్రెండీ బీట్స్‌తో కంపోజ్ చేసి, స్వయంగా ఆలపించారు. నాగచైతన్య దృఢమైన శరీరం, కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు ఓ గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు ఈ సినిమా సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి కెమెరా: రఘుల్ డి.హెరియన్, సంగీతం: అజనీష్ బి.లోక్‌నాథ్, సమర్పణ: బాపినీడు, నిర్మాణం: శ్రీవెంకటేశ్వర సినీచిత్ర, సుకుమార్ రైటింగ్స్.















