Skip to main content

Namaste NRI

వందేళ్ల తర్వాత మళ్లీ భారత్‌కు

వందేళ్లకుపైగా తమ మ్యూజియంలో భద్రపరిచిన నాగా తెగల కు చెందిన 39 మంది పూర్వీకుల అవశేషాలను యూకే లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం తిరిగి అప్పగించింది. పిట్ రివర్స్ మ్యూజియంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఫోరం ఫర్ నాగా రికన్సిలియేషన్, నాగా హోహో సంస్థలకు ఈ అవశేషాలను అధికారికంగా అందజేసింది. వాటిని నాగాలాండ్ కు తరలిస్తున్నట్లు ఎఫ్‌ఎన్‌ఆర్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ అప్పగింతను ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి, నాగా ప్రజలకు మధ్య ఉన్న సంబంధాల్లో ఓ చరిత్రాత్మక ఘట్టంగా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఐరీన్ ట్రేసీ అభివ‌ర్ణించారు. బ్రిటిష్ వలస పాలనలో తన సొంత గ్రామాన్ని ఎలా తగులబెట్టారో ఎఫ్‌ఎన్‌ఆర్‌ ప్రతినిధి వైసియర్‌ సాన్యు గుర్తుచేసుకున్నారు. ఇదిలావుంటే నాగాలాండ్‌ రాజధాని కోహిమాలోని నాగా సాలిడారిటీ పార్కు లో ఆ అవశేషాల ఖననం కోసం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events