Skip to main content

Namaste NRI

గ్రీస్‌లో ఘనంగా అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి.. చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఎప్పుడంటే?

Anirudh Kavya Marriage Photos: ప్రముఖ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సిఈఓ కావ్య మారన్ ఒక్కటయ్యారు. నవంబర్ 11న గ్రీస్‌లోని ప్రైవేట్ రిసార్ట్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. మంగళవారం సంప్రదాయ తమిళ పద్ధతిలో నిశ్చితార్థం జరగగా బుధవారం వివాహం జరిగింది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిది స్టాలిన్, సూపర్ స్టార్ రజనీకాంత్ దంపతులు, కుమార్తె ఐశ్వర్య, అనిరుధ్ తల్లిదండ్రులు లక్ష్మి ,రవిచందర్ కావ్య తల్లిదండ్రులు కలానిధి మారన్,కావేరి పలువురు తమిళ సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.

నూతన వధూవరుల తొలి ఫోటో విడుదల కాగా, నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్‌కు రంగం సిద్ధమైంది. పెళ్లి అనంతరం అనిరుధ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో నూతన వధూవరుల తొలి ఫోటోలను పంచుకుంటూ.. “My once in a lifetime, for a lifetime 11.11” అంటూ భావోద్వేగపూరిత క్యాప్షన్ రాశాడు. క్షణాల్లోనే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events