Skip to main content

Namaste NRI

మధుప్రియ, శివజ్యోతిలపై ఎన్నారై అనుచిత వ్యాఖ్యలు .. తీవ్ర దుమారం!

తెలంగాణ జానపద గాయని మధుప్రియ, యాంకర్ శివజ్యోతిలపై అమెరికాలో ఉంటున్న ఎన్నారై రజనీకాంత్ అలియాస్ రాజ్ బోడ చేసిన అసభ్యకర వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదంగా మారాయి. తెలంగాణ యాస, సంస్కృతికి గుర్తింపు తెచ్చిన మహిళా కళాకారులను ఇలా వ్యక్తిగతంగా కించపరచడంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

సోషల్ మీడియా వేదికగా ఎన్నారై రజనీకాంత్ ఎలాంటి ఆధారాలు లేకుండా మధుప్రియ, శివజ్యోతిల పేర్లను ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో తెలంగాణ కళాకారుల సంఘాలు, సామాజిక వర్గాలు భగ్గుమన్నాయి. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.డి. సత్తార్ ఈ ఘటనపై సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సదరు ఎన్నారైపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ నేత మారం ప్రవీణ్ కుమార్ వేములవాడలో మాట్లాడుతూ.. మధుప్రియ, శివజ్యోతిలను అవమానించడం అంటే తెలంగాణ సంస్కృతిని అవమానించడమేనని మండిపడ్డారు.

ఎన్నారై రజనీకాంత్ వెంటనే ఒక వీడియో విడుదల చేసి మధుప్రియ, శివజ్యోతిలతో పాటు తెలంగాణ ఆడబిడ్డలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలను కించపరిచే వారిపై ప్రభుత్వం సుమోటోగా కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సిరిసిల్ల పోలీసులకు ఫిర్యాదు అందిన నేపథ్యంలో, విదేశాల్లో ఉన్న ఆ ఎన్నారైపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events