దుల్కర్ సల్మాన్ హీరోగా, పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కు తున్న సినిమా ఆకాశంలో ఒక తార. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు. సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవు తుండగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమా ఈనెల 20న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ మీడియాతో ముచ్చటించారు.

దుల్కర్ సల్మాన్‌తో ఆకాశంలో ఒక తార చేయడం ఆనందంగా ఉంది. మహిళా సాధికారతను తెలియజెప్పే స్ఫూర్తివంతమైన కథ ఇది. ఈ చిత్రానికి జాతీయ అవార్డులు వస్తాయనే నమ్మకం ఉంది. కుటుంబ ప్రేక్షకులందరికీ ఈ కథ నచ్చుతుంది. కథలోని ఎమోషన్స్‌ను బట్టి మ్యూజిక్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశాను. ఇదొక మోడరన్ క్లాసిక్ సినిమాలా ప్రేక్షకులకు గొప్ప అనుభూతినందిస్తుంది. ప్రతీ మహిళ ఇష్టపడే సినిమా అవుతుంది.

ఈ సినిమా కోసం డిఫరెంట్ సౌండ్ డిజైన్ చేశాం. అందుకోసం స్పెషల్ సింథసైజర్స్‌ను ఉపయోగించాం. తప్పకుండా మ్యూజిక్ ఓ యూనిక్ ఫీల్‌ని అందిస్తుంది. ఇందులో మొత్తం ఐదు పాటలున్నాయి. పాటలు, నేపథ్య సంగీతం ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. శృతిహాసన్‌తో ఓ పాట పాడించాం. అది త్వరలో విడుదల కాబోతుదన్నారు.















