Namaste NRI

యూకే లో తొలి ఒమిక్రాన్ మరణం

ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌తో తొలి మరణం నమోదైంది. యూకేలో వేరియంట్‌ సోకినవారిలో ఓ వ్యక్తి మృతిచెందినట్టు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ధ్రువీకరించారు. ఈ విషయాన్ని బ్రిటన్‌ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇది తొలి  ఒమిక్రాన్‌ వేరియంట్‌ మరణం కావడంతో యూకేలో అలజడి మొదలైంది. ఒమిక్రాన్‌ తీవ్రంగా విస్తరిస్తున్న దేశాల్లో బ్రిటన్‌ ఒకటి. బ్రిటీష్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారిక లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో యూకేలో దాదాపు 663 కేసులు నమోదయ్యాయి. బ్రిటన్‌లో మహమ్మారి బారినపడ్డవారి సంఖ్య 1898కి చేరుకుంది. ఈ నెల చివరినాటికి యూకేలో ఒమిక్రాన్‌ కేసులు పది లక్షలకు చేరే అవకాశం ఉంది. మొత్తం కరోనా కేసుల్లో ఒమిక్రాన్‌ కేసులే సగానికి పైగా ఉంటాయని హెచ్చరిస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events