Namaste NRI

జనవరిలో మూడో వేవ్.. ఇది మరింత ప్రమాదకరం

ఇండియాలో ఒమిక్రాన్‌ కారణంగా జనవరి మొదటి వారంలో మూడో వేవ్‌ ప్రారంభం కావొచ్చని నేషనల్‌ కొవిడ్‌ సూపర్‌ మోడల్‌ కమిటీ అంచనా వేసింది. ఫిబ్రవరి చివరి వారంలో కరోనా కేసులు  గరిష్ఠ స్థాయికి వెళ్లవచ్చని పేర్కొన్నది. అయితే సెకండ్‌ వేవ్‌తో పోల్చితే ఇది అంత ప్రమాదకరం కాకపోవచ్చని తెలిపింది. డెల్టా వేరియంట్‌ సమయంలో చాలామంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకోలేదని గుర్తు చేసింది. దేశంలో వ్యాక్సినేషన్‌ మార్చిలో ప్రారంభమైంది. డెల్టా వేరియంట్‌ వచ్చేటప్పటికి చాలా మంది వ్యాక్సిన్‌ వేసుకోలేదు. దీంతో ఉధృతంగా వ్యాప్తించింది. ప్రస్తుతం భారత్‌లో సీరో పాజిటివిటీ రేటు 70`80 శాతం మధ్యలో ఉంది. వైరస్‌ను ఎదుర్కొనేందుకు సహజ నిరోధకత ఉంది. 85 శాతం మంది ఒక్క డోసు టీకా తీసుకున్నారు. సగం మంది రెండు డోసులు వేసుకొన్నారు. ఎంత పరిస్థితి చేయిదాటిపోయిందని అనుకొన్నా రోజువారీ కేసులు 2 లక్షలు దాటవు అని కమిటీ హెడ్‌, ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ విద్యాసాగర్‌ అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events