సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గాడ్సే. గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్బంగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఇక టీజర్‌ను గమనిస్తే 78 సెకన్ల వ్యవధి. రాజకీయ వ్యవస్థపై ఓ యువకుడి తిరుగుబాటును ఆవిష్కరిస్తూ టీజర్‌ను తీర్చిదిద్దారు. గాడ్సేను పట్టుకోవడాని మిలటరీ బలగాలు ప్రయత్నించే నేపథ్యంలో టీజర్ ఆసక్తికరంగా సాగింది. వ్యాపారం చేస్తే డబ్బులొస్తాయ్..వ్యవసాయం చేస్తే డబ్బులొస్తాయ్.. కానీ సేవ చేస్తున్నందుకు మీకు వందల వేల, లక్షల కోట్లు ఎలా వస్తున్నాయ్..బికాజ్ యువార్ లూటింగ్ పబ్లిక్ మనీ ఇన్ ది నేమ్ ఆఫ్ సర్వీస్ అంటూ టీజర్‌లో చెప్పిన సంభాషణలు శక్తివంతంగా ఉన్నాయి. అలాగే నాగబాబు, తనికెళ్ల భరణి, ఐశ్వర్యలక్ష్మి పృధ్వీ సహా పలు పాత్రధారులను కూడా టీజర్‌లో పరిచయం చేశారు.ఐశ్వర్యలక్షి, బ్రహ్మాజి, తనికెళ్ల భరణి, నాగబాబు, సిజ్జుమీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సురేష్ ఎస్, సంగీతం: సునీల్ కశ్యప్, నిర్మాణ సంస్థ: సీకే స్క్రీన్స్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: గోపీ గణేష్ పట్టాభి.














