Skip to main content

Namaste NRI

బ్రిటన్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన భరణం.. రూ.5,550 కోట్లు ఇవ్వాలని కోర్టు ఆదేశం

దుబాయ్‌ రాజు. యూఏఈ దేశ ప్రధాన మంత్రి షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూం, జోర్డాన్‌ రాకుమారి హయా బింత్‌ అల్‌ హుసేన్‌ల విడాకుల వ్యవహారంపై బ్రిటన్‌ కోర్టు తీర్పు ఇచ్చింది. భరణంలో భాగంగా హయా బింత్‌తో పాటు వారి పిల్లలకు కలిపి దాదాపు రూ.5,555 కోట్లు ( 550 మిలియన్‌ పౌండ్లు) చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తంలో రూ.2,521 కోట్లు మాజీ భార్యకు మూడు నెలల్లో చెల్లించాలి. మరో రూ.2,907 కోట్లు వీరిద్దరి పిల్లలైన అల్‌ జలీలా, జయేద్‌లకు బ్యాంకు గ్యారంటీతో చెల్లించాల్సి ఉంటుంది. దీంతో బ్రిటిష్‌ చరిత్రలో అత్యధిక ఖరీదైన విడాకులు సర్దుబాటు వ్యవహారంగా దుబాయ్‌ రాజు విడాకులను చెబుతున్నారు.

                        జోర్డాన్‌ మాజీ రాజు కుమార్తె అయిన రాజకుమారి హయాకు బ్రిటన్‌ పౌరసత్వం ఉంది. ఆమె 2019లో దుబాయ్‌ వదిలి లండన్‌ పారిపోయి తన ప్లిలల కస్టడీ కోసం బ్రిటన్‌ కోర్టుని ఆశ్రయించింది. ఇప్పుడామెకు పిల్లల కస్టడీ లభించడంతో పాటు భరణం కాకుండా వారి ఖర్చుల కోసం సంవత్సరానికి 11 మిలియన్‌ పౌండ్లు షేక్‌ మొహమ్మద్‌ చెల్లించాలని లండన్‌ కోర్టు చెప్పింది.

Social Share Spread Message

Latest News