అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం భారతీయ అమెరికన్లకు పెద్ద పీఠ వేస్తున్నది. ఆసియా అమెరికన్లు, నేటివ్ హవాయన్స్‌తో పాటు పసిఫిక్ దీవులకు చెందిన వారి కోసం ఏర్పాటు చేసిన సలహా కమిషన్‌లో నలుగురు ఇండో అమెరికన్లకు చోటు లభించింది. ఈ మేరకు వైట్‌హౌస్ ఉత్తర్వులు జారీ చేసింది. ఏఏఎన్‌హెచ్‌పీఐ సలహా కమిటీలో 23 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీలో సభ్యులుగా సోనాల్ షా, స్మితా షా, అజయ్ భుటోరియా, కమల్ కాల్సి కి నియమించారు. సోనాల్ షా విద్యా రంగంలో సేవలందిస్తుండగా, స్మిత్ షా ఇంజినీర్, వ్యాపారవేత్తగా ఉన్నారు. కమల్ కాల్సి అమెరికా సైన్యంలో సేవలందించారు. అజయ్ భుటోరియా సిలికాన్ వ్యాలీలో టెక్నాలజీ ఎగ్జిక్యూటీవ్‌గా పని చేస్తున్నారు. వీరు ఆసియా అమెరికన్లు నేటివ్ హవాయన్స్‌తో పాటు పసిఫిక్ దీవులకు చెందిన వారి సంక్షేమంపై అధ్యక్షుడికి సలహాలు ఇస్తుంటారు.














