Skip to main content

Namaste NRI

జనతా బార్ లో రాయ్ లక్ష్మి

రాయ్‌లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం జనతాబార్‌. రోచిశ్రీ మూవీస్‌ పతాకంపై రమణ మొగిలి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నది. దర్శకనిర్మాత మాట్లాడుతూ మహిళా ప్రధాన ఇతివృత్తంతో సాగే చిత్రమిది. క్రీడాకారిణిలపై ఉన్నతాధికారులు చేస్తున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా పోరాడే ఓ యువతి కథ ఇది. బాలీవుడ్‌ నటుడు శక్తికపూర్‌ ఈ సినిమా ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమవుతున్నారు. రెండు పాటలు మినహా షూటింగ్‌ పూర్తయింది అని తెలిపారు. ప్రదీప్‌ రావత్‌, సురేష్‌, అనూప్‌ సోని, అమన్‌ ప్రీత్‌, భూపాల్‌రాజ్‌,  విజ్‌భాస్కర్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వినోద్‌ యాజమాన్య, ఛాయాగ్రహణం : చిట్టిబాబు.

Social Share Spread Message

Latest News