Skip to main content

Namaste NRI

మరోసారి ఆర్ఆర్ఆర్ వాయిదా

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులు మరికొంత కాలం ఆగాల్సిందే. ఎందుకంటే ఒమిక్రాన్‌, కరోనాల ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడటం, పరిమితులు విధించడంతో ఈ నెల 7న రిలీజ్‌ కావాల్సిన ఆ ఫ్యాన్‌ ఇండియన్‌ మూవీ వాయిదా పడిరది. ఈ మేరకు అధికారికంగా సామాజిక మాధ్యమాల్లో ప్రకటించింది. తదుపరి ఎప్పుడు విడుదల చేస్తారనేది ప్రకటించలేదు. సినిమా రిలీజ్‌ కోసం మేం ఎంతగానో శ్రమిస్తున్నాం. అయితే కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో  థియేటర్స్‌లో సినిమా ప్రదర్శనలను నిలిపివేస్తున్నారు. వేరే మార్గం లేక మా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాం. తెలుగు సినిమా కీర్తిని పెంచే సినిమా తెస్తామని ప్రామిస్‌ చేశాం. కచ్చితంగా  తెస్తాం. అయితే సరైన సమయంలో వస్తాం అని చిత్ర బృందం పేర్కొంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించారు. బాలీవుడ్‌ బాలీవుడ్‌ నటులు అజయ్‌ దేవగణ్‌, అలియాభట్‌ ముఖ్య పాత్రలు పోషించారు. వేసవి సందర్భంగా సినిమాని విడుదల చేస్తారా? పరిస్థితులు అనుకూలిస్తే అంతకుముందే విడుదల చేస్తారా? అనేది చూడాలి. ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదాలతో సంక్రాంతి బరిలొకి కొత్త సినిమాలు దిగుతున్నాయి.

Social Share Spread Message

Latest News