కువైత్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 72 గంటల క్వారంటైన్ తప్పనిసరి అనే నిబంధనను రద్దు చేసింది. విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే పీసీఆర్ టెస్టు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కరోనా పరీక్షలో నెగెటివ్ వస్తే ఎలాంటి క్వారంటైన్ ఉండదు. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక ప్రకటన విడుదల చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పీసీఆర్ పరీక్ష నిర్వహించిన తర్వాత వెంటనే క్వారంటైన్‌ను ముగించవచ్చని తెలియజేసింది.














