శ్రీకాంత్ హీరోగా నటించిన చిత్రం కోతల రాయుడు. సుధీర్ రాజు దర్శకత్వం వహించారు. ఏఎస్‌కే ఫిలింస్ బ్యానర్ పై ఏఎస్ కిషోర్, కొలన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. డిరపుల్ చొపడే, నటాషా దోషి నాయికగా నటించారు. వినోదాత్మక కుటుంబ కథా చిత్రంగా రూపొందించారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ కామెడీ, ఫైట్స్ బాగున్నాయి. శ్రీకాంత్ పాత్ర అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. కుటుంబ ప్రేక్షకులు చూసేలా కోతల రాముడు సినిమా ఉంటుందన్నారు. మంచి సినిమా ఎప్పుడొచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారని తెలుసు. ఆ నమ్మకంతోనే ఇప్పుడీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అన్నారు. చెబుతున్నారు దర్శకుడు సుధీర్ రాజు. పృథ్వీ, మురళీ శర్మ, సత్యం రాజేష్, పోసాని కృష్ణ మురళి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం` సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ` బుజ్జి, ఎడిటర్: ఉద్ధవ్. ఈ సినిమాని ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది.














