విలక్షణ నటుడు మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం సన్ ఆఫ్ ఇండియా. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, శ్రీ లక్ష్మీ ప్రసన్న సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రకథానాయకుడిగా మోహన్‌బాబు అదనంగా చిత్రానికి స్క్రీన్‌ప్లే బాధ్యతను కూడా నిర్వహించారు. మంచు విష్ణు నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశలో ఉన్న ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. దేశభక్తి నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో మోహన్‌బాబు పవర్‌పుల్ రోల్ పోషించారు. ఆయన కోడలు, విష్ణు సతీమణి విరోనిక ఈ సినిమాలో మోహన్‌బాబుకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశారు. మోహన్‌బాబు మార్కు డైలాగులు, యాక్షన్ ఎపిసోడ్స్, ఊహించని మలుపులతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని చిత్ర బృందం అంటోంది. ఇళయరాజా సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఫిబ్రవరి 18న థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.














