Namaste NRI

హీరో ఆదికి జోడీ గా  దిగాంగనా సూర్యవంశీ

ఆది సాయికుమార్‌ హీరోగా ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా కోసం ఆదికి జోడిగా బాలీవుడ్‌ తార దిగాంగన సూర్యవంశీని ఖరారు చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఓ సరికొత్త కథాంశంతో చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమాని రూపొందిస్తున్నాం. ఇందులో ఆది సాయికుమార్‌ సరికొత్త లుక్‌తో కనిపిస్తారు. ఈ చిత్రంలో దిగంగనా కథానాయికగా నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఆమెకు మా శుభాకాంక్షలు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం అని దర్శక నిర్మాతలు తెలిపారు. కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్‌ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ నిర్మిస్తున్న 10వ చిత్రమిది. ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియజేయనున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సతీష్‌ ముత్యాల, సంగీతం: ఆర్‌ఆర్‌ ధృవన్‌, ఎడిటర్‌ : గిడుతూరి సత్య.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events