ఉక్రెయిన్లో రష్యా యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ యుద్ధంలో వేల సంఖ్యలో సైనికులు, వందల సంఖ్యలో సామాన్య పౌరులు మృత్యువాతపడ్డారు. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మరో కీలక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా రష్యా ప్రజలను ఉద్దేశిస్తూ కీలక అభ్యర్థన చేశారు. రష్యన్ సైనికుల తల్లులు తమ కొడుకులను యుద్దానికి పంపించకుండా అడ్డుకోవాలంటూ విన్నవించారు. రష్యన్ తల్లులకు మరోసారి విన్నవిస్తున్నా మీ కుమారులను విదేశీ గడ్డపైకి యుద్దానికి పంపకండి. మీ కొడుకు ఎక్కడ ఉన్నాడో చెక్ చేసుకోండి. మీ ప్రభుత్వం వారిని విన్యాసాలు చేయడానికో మరో ప్రాంతానికో పంపించమంటే నమ్మకండి. మీ కుమారుడిని ఉక్రెయిన్లో యుద్ధం చేయడానికి పంపిచినట్లు ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే అడ్డుకోండి అని మహిళలను అభ్యర్థించారు. ఇలాంటి భయానక యుద్ధాన్ని ఉక్రెయిన్ ఎన్నడూ కోరుకోలేదని జెలెన్స్కీ ఈ సందర్భంగా తెలిపారు. అయితే తమ దేశానికి కాపాడుకునేందుకు ఎంతవరకైనా పోరాడుతామన్నారు.














