అమెరికా ప్రభుత్వంలో మరో భారతీయ సంతతి వ్యక్తికి కీలక బాధ్యత లభించింది. షెపాలి రాజ్దాన్ దుగ్గల్‌ను నెదర్‌ల్యాండ్స్ రాయబారిగా ఎంపిక చేసినట్టు అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు అధ్యక్షుడి అధికార నివాసం శ్వేతసౌధం ఓ ప్రకటన విడుదల చేసింది. షెఫాలీ అమెరికాలో మానవ, మహిళ హక్కుల కార్యకర్తగా గతంలో విశేష సేవలు అందించారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి చెందిన షెఫాలీ జర్దాన్ దుగ్గల్ అమెరికాలో స్థిరపడ్డారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ కమ్యూనికేషన్‌లో పీజీ చేశారు. ఆ తర్వాత మియామీ యూనివర్శిటీ నుంచి మాస్ కమ్యూనికేసన్ విభాగంలో బీఏ చేసిన షెఫాలీ న్యూయార్క్ యూనివర్సిటీలో మీడియా సైకాలజీలో ఎమ్మే చేశారు. ఆ తర్వాత యూఎస్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. విమెన్ రైట్స్ యాక్టివిస్ట్, హుమన్ రైట్స్ క్యాంపెయినర్‌గా చాలా కాలం పని చేశారు. అనేక అవార్డులు గెలుచుకున్నారు. ఒబామా ప్రభుత్వంలో ఆమె యూనైటెడ్ స్టేట్స్ హోల్‌కాస్ట్ మెమోరియల్ మ్యూజియమ్ కౌన్సిల్‌లో ప్రత్యేక సభ్యురాలిగా ఉన్నారు. ప్రస్తుతం బైడెన్ ప్రభుత్వంలో ఆమె పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు.














