Namaste NRI

మిస్ వరల్డ్ 2021గా పోలండ్ సుందరి

పోలాండ్‌కి చెందిన అందగత్తె ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. పోలండ్‌కు చెందిన కరోలినా బిలస్కా మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని గెలుచుకున్నది. ప్యూర్టోరికోలోని షాన్‌జువాన్‌లో జరిగిన 70 ఎడిషన్‌ మిస్‌ వరల్డ్‌ 2021 పోటీల్లో కరోలినా విజేతగా నిలిచింది. అమెరికాకు చెందిన ఇండియన్‌ ఆరిజన్‌ శ్రీ సైనీ మొదటి రన్నరప్‌గా, కోట్‌ డి ఐవరీకి చెందిన ఒలివియా యాస్‌ రెండో రన్నరప్‌గా నిలిచింది. షాన్‌ జువాన్‌లోని కొకొ కోలా మ్యూజిక్‌ హాల్‌ జరిగిన వేడుకల్లో 69వ ఎడిషన్‌ విజేత టోని ఆన్‌ సింగ్‌ కరోలినాకు ప్రపంచ సుందరి కిరీటాన్ని బహుకరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజేతగా తన పేరు విన్నప్పుడు షాక్‌ అయ్యానని, ఇప్పటికీ తాను నమ్మలేకపోతున్నానని చెప్పారు. మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని ధరించడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పింది. కరోలినా ప్రస్తుతం మేనేజ్‌మెంట్‌లో పీజీ చేస్తున్నది. తర్వాత పీహెచ్‌డీ చేస్తానని, అదే విధంగా మోడల్‌గా కొనసాగుతానని తెలిపింది. బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌, స్కూబా డైవింగ్‌, స్విమ్మింగ్‌ చేయడాన్ని ఆమె అమితంగా ఇష్టపడుతుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events