రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం రావణాసుర. సుధీర్‌వర్మ దర్శకుడు. ఈ సినిమాలో యువ హీరో సుశాంత్ కీలక పాత్రను పోషిస్తున్నారు. అను ఆమ్మిన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ కథానాయికలు. అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇందులో రవితేజ, సుశాంత్ పాల్గొన్నారు. సుశాంత్ జన్మదినం సందర్భంగా చిత్ర బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ క్తొత పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ స్టిల్‌లో ఆయన పొడవాటి జుట్టు, గడ్డంతో రఫ్ లుక్‌లో కనిపిస్తున్నారు. రోమాంచితమైన యాక్షన్ థ్రిల్లర్ ఇది. రవితేజ, సుశాంత్ పాత్రలు పోటాపోటీగా సాగుతాయి. ఈ సినిమలో రవితేజ లాయర్ పాత్రలో కనిపిస్తారు అని చిత్రం బృందం తెలిపింది. రావు రమేష్, మురళీ శర్మ, సంతాప్ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : విజయ్ కార్తీక్ కన్నన్, సంగీతం : హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు : శ్రీకాంత్ విస్సా, నిర్మాణ సంస్థలు : అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్, దర్శకత్వం సుధీర్‌వర్మ. ఈ ఏడాది సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందు రానున్నది.














