ఉక్రెయిన్‌లో శాంతి కోసం పని చేద్దామని భాతర్ ప్రధాని నరేంద్ర మోదీకి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయించుకున్నారు. ఇరువురు నేతలు ఫోన్ చేసి మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తీసుకుంటున్న చర్యలతో ప్రపంచానికి పెను విపత్తు కలుగుతుందని బోరిస్ జాన్సన్ అన్నారు. ఉక్రెయిన్‌లో ఉన్న తీవ్రమైన యుద్ధ పరిస్థితుల గురించి ఆయన సుదీర్ఘంగా ప్రధాని మోదీతో చర్చించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి బ్రిటన్ ప్రధాని కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్ సమగ్రత, సార్వభౌమత్వాన్ని అందరూ కచ్చితంగా గౌరవించవలసిందేన్న అభిప్రాయాన్ని ఇద్దరు నేతలూ అంగీకరించినట్లు తెలిపింది.
ఐక్యరాజ్య సమితి నిబంధనలకు రష్యా లోబడి ఉండవలసిందేనని ఇద్దరు నేతలు చెప్పారు. ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వం, పరిఢవిల్లాంటే అంతర్జాతీయ చట్టాలను అందరూ ఆచరించాలని మోదీ, బోరిస్ అభిప్రాయపడ్డారు. మానవ సంక్షోభం దృష్ట్యా ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని ప్రధాని మోదీ మరొకసారి హామీ ఇచ్చారు. కాగా, వాణిజ్యం, భద్రత, వ్యాపార రంగాల్లో బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేసేందుకు రెండు దేశాల నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారని, వీలైనంత త్వరగా ప్రత్యక్ష సమావేశం ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తున్నారని బ్రిటన్ ప్రధాని కార్యాలయం వెల్లడిరచింది.
గతేడాది ఇ్దదరు నేతలు మధ్య జరిగిన వర్చువల్ సమ్మిట్ సందర్భంగా ఆమోదించిన ఇండియా యూకే రోడ్ మ్యాప్ 2030 అమలులో సాధించిన పురోగతిని కూడా ఆయన అభినందించారు. ప్రధాన మంత్రి జ్సాన్‌ను త్వరలో భారత్ పర్యటనకు మోదీ ఆహ్వానించినట్టు సమాచారం. దీనికి ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తున్నది.














