Skip to main content

Namaste NRI

పుతిన్‌ పెద్ద తప్పు చేశాడు…నాటో చీఫ్‌

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఉక్రెయిన్‌పై దండెత్తి భారీ తప్పిదానికి పాల్పడ్డాడని నాటో చీఫ్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ ఆరోపించారు. బ్రసెల్స్‌లో నాటో సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర సాధికార దేశంపై యుద్ధాన్ని చేపట్టిన అధ్యక్షుడు పుతిన్‌ పెద్ద తప్పు చేశాడని అన్నారు. ఉక్రెయిన్‌ ప్రజల బలం, సాహసాలను, ఆ దేశ సైనిక పాటవాన్ని ఆయన తక్కువ అంచనా వేశాడని అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపధ్యంలో కూటమి దేశాలకు ఎదురయ్యే ముప్పును నివారించేందుకు తూర్పు ప్రాంతంలో నాటో వేలాది సైనికులు వినియోగించింది.

               ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ 7000 నుంచి 15,000 మంది వరకూ రష్యన్‌ సైనికులు మరణించారని నాటో పేర్కొంది. ఉక్రెయిన్‌ అధికారుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా రష్యన్‌ సైనికుల మరణాలపై ఈ అంచనాకు వచ్చిన నాటో సైనికాధికారి పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News