Skip to main content

Namaste NRI

మన ఊరు- మన బడిలో ఎన్ఆర్ఐలు భాగస్వామ్యం కావాలి : మంత్రి కేటీఆర్

విద్యా యజ్ఞంలో ఎన్‌ఆర్‌ఐలు భాగస్వామ్యం కావాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. న్యూజెర్సీలోని ఎడిషన్‌ టౌన్‌ షిప్‌లో మన ఊరు`మన బడి ఎన్‌ఆర్‌ఐ పోర్టల్‌ను మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ చేపట్టిన విద్యా యజ్శానికి తెలంగాణ ప్రవాసులు భారీగా విరాళాలు ప్రకటించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు, వాటి రూపురేఖలను మార్చేందుకు సీఎం కేసీఆర్‌ కంకణం కట్టుకున్నారని తెలిపారు. అది నిజానికి మన ఊరు` మన బడి కార్యక్రమం కాదు.. విద్యా యజ్ఞం అని స్పష్టం చేశారు.  ఈ యజ్ఞంలో భాగంగా 26 వేల ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం రూ.7,300 కోట్లు కేటాయించామని తెలిపారు. ఎన్‌ఆర్‌ఐలు కూడా తాము చదువుకున్న పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు.

Social Share Spread Message

Latest News