తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రిలో ఆద్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ఈరోజు ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. బాలాలయంలోని శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో నిర్వహించిన శోభయాత్రలో సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రభుత్వ అధికారులు, అర్చకులు వేద పండితులు పాల్గొన్నారు. శోభయాత్రలో భాగంగా బంగారు కవమూర్తులు, ఉత్సవ విగ్రహాలు, అళ్వార్లు ప్రదర్శించడంతో పాటు కళా ప్రదర్శనలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణాలు, మేళతాళాల మధ్య శోభయాత్ర వైభవంగా కొనసాగుతోంది. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ప్రధానాలయం పంచతల రాజగోపురం వద్ద కేసీఆర్ స్వయంగా పల్లకిని మోశారు. సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.














