Skip to main content

Namaste NRI

వైట్‌హౌస్‌లో మరోసారి కరోనా కలకలం

అమెరికా అధ్యక్షుడి అధికార నివాసమైన వైట్‌ హౌస్‌లో మరోసారి కరోనా కలకలం రేపింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కలిసి బ్రస్సెల్స్‌, పోలాండ్‌ దేశాల్లో పర్యటించి తిరిగి అమెరికా వచ్చిన అధికార మహిళా ప్రతినిధి కరీన్‌ జీన్‌ పియర్‌కు కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. అయితే కొవిడ్‌ టీకాలు వేయించున్న బో బైడెన్‌కు మాత్రం ఎలాంటి కరోనా ముప్పు లేదని జీన్‌ పియర్‌ తెలిపారు. నేను పీసీఆర్‌ పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్‌ అని వచ్చింది. అధ్యక్షుడితో జరిపిన సమావేశంలో నేను సామాజిక దూరం పాటించాను అని జీన్‌ పియర్‌ తెలిపారు. తనకు కరోనా తేలికపాటి లక్షణాలున్నాయని పియర్‌ పేర్కొన్నారు. బెల్జియం, పోలాండ్‌ దేశాల్లో బిడెన్‌ తో పాటు ఉక్రెనియన్‌ శరణార్థులతో జరిగిన సమావేశాల్లో జీన్‌ పియర్‌ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News