Skip to main content

Namaste NRI

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు సంచలన ప్రకటన

టర్కీలో రష్యా, ఉక్రెయిన్‌ ప్రతినిధుల శాంతి చర్చలు జరుగుతాయనే ప్రచారం నడుమ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ ఆసక్తికర ప్రకటనకు తెర లేపాడు. యుద్ద సంక్షోభానికి ముగింపు పలికే దిశగా ఆయన ప్రకటన ఉండడం విశేషం. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యా జర్నలిస్టులకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తటస్ఠ వైఖరిని అవలంభించేందుకు ఉక్రెయిన్‌ సిద్ధమంటూ సంచలన ప్రకటన చేశారు. ఒక వేళ యుద్ధం ఆగిపోతే తాము తటస్థంగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కానీ దీని కోసం సెక్యూర్టీ గ్యారెంటీ ఇవ్వాలన్నారు. శాంతి ఒప్పందంలో భాగంగా తాము తటస్థంగా ఉండేందుకు అంగీకరిస్తామని జెలెన్‌స్కీ అన్నారు. ఒకవేళ తటస్థ వైఖరికి అంగీకరిస్తూ, అప్పుడు తాము నాటోలో చేరబోమని స్పష్టం చేశారు. సుమారు 90 నిమిషాల పాటు వీడియో కాల్‌లో జెలెన్‌స్కీ పాల్గొన్నారు. అయితే థార్డ్‌ పార్టీలు తమకు హామీ ఇస్తే, అప్పుడు తాము తటస్థంగా ఉండబోనున్నట్లు తెలిపారు. దీని కోసం రిఫరెండం కూడా నిర్వహించాలన్నారు.

Social Share Spread Message

Latest News