Namaste NRI

భారత్‌తో సంబంధాలకు అమిత ప్రాధాన్యం : బ్రిటన్‌

ఉక్రెయిన్‌ సంక్షోభ పరిస్థితులు మధ్య భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌, యూకే విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌తో సమావేశమయ్యారు. భారత పర్యటనలో భాగంగా విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌తో పలు అంశాలపై ఆమె విస్తృతంగా చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో ప్రస్తుతం భారత్‌తో సంబంధాలు బలోపేతం చేసుకోవడం తమకు మునుపెన్నడూ లేనంత ప్రాధాన్యాంశంగా మారిందని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ అన్నారు. అనంతరం భారత్‌, బ్రిటన్‌ స్ట్రాటజిక్‌ వ్యూచర్స్‌ ఫోరమ్‌ను ఉద్దేశించి ట్రస్‌ మాట్లాడారు.రక్షణ,  వాణిజ్య, సైబర్‌ సెక్యూరిటీ రంగాల్లో మరింతగా కలసి పనిచేసే అవసరముందని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events