Skip to main content

Namaste NRI

నాగార్జున చేతుల మీదుగా గాలివాన ట్రైలర్

సీనియర్‌ నటి రాధికాశరత్‌కుమార్‌, సాయికుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ గాలివాన. ఏప్రిల్‌ 14న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఇప్పటికే వచ్చిన టీజర్‌ ఈ సిరీస్‌పై ఆసక్తి రేపింది. తాజాగా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. కింగ్‌ నాగార్జున  చేతుల వేదికగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో కంటెంట్‌ను గమనిస్తే ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సస్పెన్స్‌ క్రైం థ్రిల్లర్‌గా అనిపిస్తోంది. సాయికుమార్‌ పాత్ర కూడా చాలా బలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. రెండు కుటుంబాలు ఎదురొచ్చిన తుఫాన్‌, తమ వాళ్లను రక్షించుకోవటానికి ఎంత దూరం వెళ్తారు అనేదే కథగా ఉంటుంది. జంట హత్యల మిస్టరీ చుట్టూ టీజర్‌ ఉంటుంది. ఈ వెబ్‌సిరీస్‌కు శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో చాందినీ చౌదరి, చైతన్యకృష్ణ, శరణ్‌య ప్రదీప్‌, ఆశ్రిత వేముగంటి, నందినియార్‌, తాగుబోతు రమేష్‌ తదితరులు నటించారు. ఓవరాల్‌గా ఈ సిరీస్‌ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో  తెలియాలంటే ఏప్రిల్‌ 14 వరకు వెయిట్‌ చేయక తప్పదు.

Social Share Spread Message

Latest News