Skip to main content

Namaste NRI

ఫార్వార్డ్‌ మెసేజ్‌లపై.. వాట్సాప్‌ సంచలన నిర్ణయం

ప్రముఖ సోషల్‌ మీడియా మెసేజింగ్‌ ప్లాట్‌ ఫాం వాట్సాప్‌ ఫార్వార్డ్‌ మెసేజ్‌లపై  సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రూపులో మెసేజ్‌లు ఫార్వార్డ్‌ చేయడంపై పరిమితి తీసుకువచ్చింది. ఇకపై గ్రూపులో ఫార్వార్డ్‌ మెసేజ్‌లను ఒకసారికి మించి ఫార్వార్డ్‌ చేయడం కుదరదు. యూజర్లు ఫార్వార్డ్‌ మెసేజ్‌ లను ఒక గ్రూపు కంటే మించి ఇతర గ్రూపులకు ఫార్వార్డ్‌ చేయడాన్ని ఈ ఫీచర్‌ నిరోధిస్తుంది. గ్రూపుల్లో స్పామ్‌ మెసేజ్‌లు, తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టడానికి వాట్సాప్‌ ఈ చర్యలు తీసుకుంది. ఈ ఫీచర్‌ ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతానికి కొందరు ఆండ్రాయిడ్‌ యూజర్లకు బీటా వెర్షన్‌ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇదే జరిగితే ఇంకొన్ని రోజుల్లో అన్ని స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్‌ మెసేజ్‌లను ఒకటి కంటే ఎక్కువ గ్రూపులు/ వ్యక్తులకు ఫార్వర్డ్‌ చేసే వీలు ఉండకపోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్‌లో ఒకసారి ఐదుగురికి, ఐదు గ్రూపులకు ఫార్వర్డ్‌ చేయొచ్చు.

Social Share Spread Message

Latest News