ఉక్రెయిన్ ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా వెన్నుపోటు పొడుస్తోందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా రష్యా దళాలు తమ దేశం నుంచి వెనుదిరగాలని ఆ తర్వాత శాంతి ఒప్పందం చేసుకుని, దానిపై ప్రజల్లో రిఫరెండం జరిపిద్దామని ఉక్రెయిన్ చేస్తున్న ప్రతిపాదనలు అర్థం లేనివని అన్నారు. ఒప్పందానికి రిఫరెండంలో ఉక్రెయిన్ ప్రజలు ఆమోదం తెలపకపోతే ఏం చేస్తారు? ఈ పిల్లీ ఎలుకా ఆటలు మాకిష్టం లేదు అంటూ కుండబద్దలు కొట్టారు. 2015లో తూర్పు ఉక్రెయిన్ విషయమై ఫ్రాన్స్, జర్మనీ మధ్యవర్తిత్వంలో కుదిరిన మిన్స్‌క్ ఒప్పందం అమలుకే నోచుకోలేదని గుర్తు చేశారు. ఉక్రెయిన్‌కు సంఫీుభావ సూచకంగా ఆ దేశ జాతీయ పతాకాన్ని పోప్ ఫ్రాన్సిస్ ముద్దాడారు.














