Namaste NRI

అమెరికా వైపే భారత విద్యార్థుల చూపు..

అగ్రరాజ్యం అమెరికా వైపే  పై చదువుల కోసం భారత్‌ విద్యార్థులు  ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.  అమెరికాలోని విద్యా సంస్థలో 2021లో చేరిన మన విద్యార్థుల సంఖ్య దాదాపు 12 శాతం పెరిగింది.  చైనా నుంచి అమెరికా వెళ్లే వారి సంఖ్య 8 శాతానికి  తగ్గింది. అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం తన వార్షిక నివేదికను విడుదల చేసింది. 2021లో 12,36,748 మంది ఎఫ్‌`1, ఎం`1వీసా విద్యార్థులు అమెరికాలోని విద్యా సంస్థల్లో చేరారని తెలిపింది. 2020తో పొలిస్తే  2021లో చైనా నుంచి 33,569 మంది విద్యార్థులు తక్కువగా వెళ్లారని,  భారత్‌ నుంచి మాత్రం 25,391 మంది వెళ్లారని తెలిపింది. ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికా వెళ్తున్న దేశాల్లో చైనా (3,48,992 మంది) మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో భారత్‌ (2,32,851 మంది) ఉంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events