Skip to main content

Namaste NRI

రష్యాకు మరోసారి హ్యాండిచ్చిన భారత్

రష్యాకు మరోసారి హ్యాండిచ్చింది భారత్‌. ఎందుకంటే.. ఉక్రెయిన్‌పై దాడి కారణంగా రష్యాకు ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా  ప్రపంచ మానవ హక్కుల మండలి నుంచి రష్యాను సస్పెండ్‌ చేస్తూ 193 మంది సభ్యులతో కూడిన ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. సాధారణ అసెంబ్లీలో మొత్తం 193 సభ్యుల  ఓటింగ్‌కు గానూ రష్యాను తొలగించాలంటూ 93 ఓట్లు వచ్యాయి. 24 వ్యతిరేక ఓట్లు రాగా, 58 మంది ఓటింగ్‌కు దూరంగాఉన్నాయి. అయితే ఈ ఓటింగ్‌ వేళ బారత్‌ మరోసారి ఆచితూచి వ్యవహరించింది. ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉంది. అయితే ఓటింగ్‌ ముందు భారత్‌లో రష్యా మాట్లాడిరది. తమకు అనుకూలంగా ఉండాలని సూచించింది. అయినప్పటికి ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

                 ఈ సందర్భంగా ఓటింగ్‌పై యూఎన్‌లో భారత శాశ్వత ప్రతినిధి  టీఎస్‌ తిరుమూర్తి స్పందిస్తూ ఉక్రెయిన్‌ వివాదం ప్రారంభమైన నాటి నుంచి భారతదేశం శాంతి, చర్చలు, దౌత్యం కోసం నిలబడిరది. రక్తం చిందించడం, అమాయకుల ప్రాణాలను తీసుకోవడం కారణంగా ఎలాంటి పరిష్కారం ఉండదని మేము నమ్ముతున్నాము. ఇండియా ఎప్పుడూ శాంతి పక్షమే అన్నారు. హింసను కోరుకోదని స్పష్టం చేశారు.

Social Share Spread Message

Latest News