Namaste NRI

లక్కీ మీడియా మూవీ ప్రారంభం

లక్కీ మీడియా సంస్థ రూపొందిస్తున్న తాజా చిత్రం శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమా ద్వారా సన్నీ పస్తా హీరోగా, కార్తీక్‌ పంపాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ముహూర్తపు సన్నివేశానికి వి.వి.వినాయక్‌ క్లాప్‌నివ్వగా, సి.కల్యాణ్‌ కెమెరా స్విఛాన్‌ చేశారు. బెక్కెం వేణుగోపాల్‌ చిత్ర విశేషాలు తెలియజేస్తూ మా సంస్థకిది 13వ చిత్రం. నగర నేపథ్యంలో నడిచే ప్రేమకథగా తెరకెక్కించబోతున్నాం. నవతరం ప్రేమ భావనలకు అద్దం పడుతుంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తాం అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ నా కథను నమ్మి నిర్మాత నాకీ అవకాశమిచ్చారు. ఈ కథకు సన్నీ సరిగ్గా సరిపోయాడన్నారు. థియేటర్‌ నేపథ్యం నుంచి వచ్చిన హీరో సన్నీ ఈ కథకు చక్కగా కుదిరాడని అన్నారు. బెక్కం వేణుగోపాల్‌, బెక్కెం సబిత నిర్మాతలు. బాబీ గౌరవ దర్శకత్వం వహించారు.  ఈ చిత్రానికి కెమెరా:: మితేష్‌ పి, సహ నిర్మాత : నాగార్జున వడ్డే, ఆర్ట్‌: విఠల్‌ కోసనమ్‌, కథ, దర్శకత్వం: కార్తీక్‌ పంపాల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events