Skip to main content

Namaste NRI

మరియాపోల్‌ మాత్రమే కాదు.. కీవ్‌పై కూడా

ఉక్రెయిన్‌పై రష్యా సేనల దాడుల నేపథ్యంలో రిపబ్లికన్‌ ఆఫ్‌ చెచెన్యా దేశాధ్యక్షుడు రంజాన్‌ కడీరోవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరియాపోల్‌ మాత్రమే కాదు. కీవ్‌పై కూడా దాడి చేస్తాం అన్నారు. ముందుగా లుహాన్స్‌, డోనెట్స్‌ ప్రాంతాలకు విముక్తి కలిగిస్తామన్నారు. ఆ తర్వాత కీవ్‌, ఇతర నగరాలను కూడా స్వాధీనం చేసుకుంటాం అని స్పష్టం చేశారు. తనను తాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సైనికుడిగా చెప్పుకునే రంజాన్‌ కీవ్‌ విషయంలో ఎటువంటి అనుమానాలూ అక్కర్లేదని ధీమా వ్యక్తం చేశారు. ఒక్క అడుగు కూడా వెనక్కు తీసుకోవడం జరగదని, ఈ విషయంలో తాను హామీ ఇస్తున్నానని అన్నారు.

Social Share Spread Message

Latest News