Skip to main content

Namaste NRI

సర్కారు వారి పాట షూటింగ్‌ పూర్తి

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సర్కారువారి పాట. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్‌ కథానాయికగా నటిస్తున్నారు. కాగా ఒక పాట మినహా ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ సర్కారువారి పాట కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎస్‌ఎస్‌ తమన్‌ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన కళావతి, పెన్ని పాటలు చార్ట్‌ బస్టర్స్‌గా రికార్డులు సృష్టించారు. పెన్ని పాటలో సితార  ఘట్టమనేని క్యూట్‌ అండ్‌ ట్రెండీ డ్యాన్స్‌లతో ప్రేక్షకులని మైస్మరైజ్‌ చేసింది. బ్యాలెన్స్‌ ఉన్న ఒక పాటను త్వరలోనే చిత్రీకరరిస్తాం అన్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్‌, 14  రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌లపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్‌ మధి, లైన్‌ ప్రొడ్యూసర్‌ : రాజ్‌ కుమార్‌, సీఈవో : చెర్రీ. ఈ సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది.

Social Share Spread Message

Latest News