Skip to main content

Namaste NRI

ధనుష్‌ క్లాప్‌తో సెల్ఫిష్‌ ప్రారంభం

రౌడీబాయ్స్‌ తో పరిచయమైన కథానాయుడు ఆశిష్‌ రెండో చిత్రం సెల్ఫిష్‌ హైదరాబాద్‌లో మొదలైంది. ముహుర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీష్‌ శంకర్‌ కెమెరా స్విచాన్‌ చేయగా, కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్‌ క్లాప్‌ ఇచ్చారు. అనంతరం యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ తెలిపారు ధనుష్‌. విశాల్‌ కాశి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, సుకుమార్‌ రైటింగ్‌ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్‌ బండ్రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: మణికందన్‌.ఎస్‌, మిక్కీజే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు.

Social Share Spread Message

Latest News