Namaste NRI

హారర్‌ విత్‌ టెర్రర్‌ ట్రైలర్‌ విడుదల చేసిన సి.కల్యాణ్‌

స్వర్ణ, సిక్కోలు శ్రీనివాస్‌ ప్రధాన పాత్రల్లో వంశీరాజు తెరకెక్కించిన చిత్రం హారర్‌ వవిత్‌ టెర్రర్‌. పి.జనార్థన్‌ రెడ్డి నిర్మించారు. ఇందిరా ఆర్ట్‌ క్రియేషన్స్‌ టి.రాజు సమర్పణలో పీజేఆర్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై పి.జనార్థన్‌ రెడ్డి నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను నిర్మాత సి.కల్యాణ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైలర్‌ చాలా బాగుంది. ప్రేక్షకులకు సినిమా తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నానన్నారు. ఆద్యంతం ఆసక్తిరేకెత్తించే కథనంతో ఈ సినిమా తెరకెక్కించాం. ఘన విజయాన్ని అందుకొని మా చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా అన్నారు దర్శకుడు.  ఈ కార్యక్రమంలో స్వర్ణ, శ్రీనివాస్‌, రామ సత్యనారాయణ, సాయి వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సుధాకర్‌ నాయుడు, సంగీతం: అర్జున్‌ ప్రసాద్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events