Skip to main content

Namaste NRI

కీలక సమయంలో భారత్‌కు వస్తున్న బ్రిటన్‌ ప్రధాని

యూకే  ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భారత పర్యటనకు రానున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా తన దాడులను తీవ్రతరం చేయడం, ఆ దేశంపై పెద్ద ఎత్తున ఆంక్షలకు మద్దతునిస్తున్న బ్రిటన్‌ ప్రధాని ఈ కీలక సమయంలో భారత్‌ పర్యటనను ఎంపిక చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.  ఈ నెల 21 నుంచి రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటిస్తారని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఉద్యోగాల కల్పన, ఆర్థిక వృద్ధి, ఇంధన భద్రత, రక్షణ రంగాలకు సంబంధించి, ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయని అధికారులు వెల్లడిరచారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని పటిష్టం చేసుకోవడం, వ్యూహాత్మక రక్షణ రంగ చర్యలు, దౌత్య, ఆర్థిక భాగస్వామ్యం లాంటి విషయాలపై ఇరు దేశాల నేతలు లోతుగా చర్చిస్తారని ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కార్యాలయ అధికారులు పేర్కొన్నారు.

                ఉక్రెయిన్‌ పై రష్యా దురాక్రమణ విషయంలో భారత్‌ తటస్ఠ వైఖరిని అమెరికా తప్పు పడుతుండడం తెలిసిందే. కానీ అదే సమయంలో ముఖ్య దేశాల నాయకులు భారత్‌కు వస్తూ కీలక చర్చలు నిర్వహిస్తుండడం, భారత్‌కు పెరిగిన ప్రాధాన్యాన్ని సూచిస్తోంది.

Social Share Spread Message

Latest News