Skip to main content

Namaste NRI

ఆందోళనలతో అట్టుడుకుతున్న శ్రీలంక

శ్రీలంక తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో నలిగిపోతుంది. దీంతో రాజధాని కొలంబోతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు పెద్దయెత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇంధన థరల పెంపును నిరసిస్తూ నైరుతి ప్రాంతంలోని రంబుక్కన పట్టణంలో నిరసన చేపట్టిన ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, 12 మందికి గాయాలయ్యారు. ఆందోళనలో చోటుచేసుకున్న తొలి మరణం ఇదే. హింసాత్మక ఘటనల తర్వాత పట్టణంలో కర్ఫ్యూ విధించారు.  ఆందోళనకారులు  ఓ రైల్వే ట్రాక్‌ను దిగ్భందించారు. ఈ సందర్భంగా వారికి, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. వెళ్లిపోవాలని కోరినా ఆందోళనకారులు వినలేదని, బలగాలపై రాళ్లు రువ్వారని పోలీసులు పేర్కొన్నారు. ఆయిల్‌ ట్యాంకర్‌ మరో వెహికిల్‌కు  నిప్పంటించేందుకు యత్నించారని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మొదట టియర్‌ గ్యాస్‌, తర్వాత కాల్పులు జరిపామని పోలీసులు ఉన్నతాధికారి తెలిపారు.

Social Share Spread Message

Latest News