శ్రియ శరణ్, శర్మణ్ జోషి కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా మ్యూజిక్ స్కూల్. ఈ సినిమా నాలుగో షెడ్యూల్‌ని ఇటీవల గోవాలో పూర్తి చేశారు. బ్రహ్మాండమైన టూరిస్ట్ ప్లేసుల్లోనూ, బీచ్ బ్యాక్ డ్రాప్‌లలోనూ ఈ సినిమాలోని కీలకమైన టాకి పోర్షన్‌ని కంప్లీట్ చేశారు డైరక్టర్. గోవాలో పూర్తి చేసిన ఈ షూటింగ్‌తో దాదాపు 95 శాతం చిత్రీకరణ పూర్తయినట్టే. మ్యూజిక్ స్కూల్‌లో తన పోర్షన్‌ని పూర్తి చేసిన షాన్ మాట్లాడుతూ మ్యూజిక్ స్కూల్‌కి షూటింగ్ చేస్తున్నంత సేపు చాలా అద్భుతంగా అనిపించింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరం పెద్ద కుటుంబంలోని వ్యక్తుల్లాగా కలిసిపోయామని తెలిపారు. పాపారావు బియ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. యామినీ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఇళయరాజా స్వారాలందిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. కిరణ్ డియోహాన్స్ ఛాయాగ్రాహకుడు.














