ఈ ఏడాది హజ్ యాత్రకు సౌదీ అరేబియా అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది 79,237 మందిని యాత్రకు అనుమతి ఇచ్చింది. 65 సంవత్సరాలు పైబడిన వారందరికీ అవకాశం లేదని సౌదీ ప్రభుత్వం భారత్‌కు తెలిపిందని మైనారిటీ వ్యవహారాల శాఖ తెలిపింది. మైనారీటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ యాత్ర కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, హజ్ డ్యూటీకి అధికారులు, సిబ్బంది ఇంటర్వ్యూ పూర్తయ్యిందని తెలిపారు.అయితే యాత్రకు వచ్చేవాందరికి రెండు డోసుల టీకా, ఆర్‌టీ పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసిందని తెలిపారు. కరోనా తర్వాత భారతీయ ముస్లింలు హజ్ యాత్ర కోసం సౌదీ అరేబియాకు వెళ్లడం ఇదే తొలిసారి. భారత్‌కు 79,237 కోటాను సౌదీ ప్రభుత్వం నిర్ణయయించినట్లు పేర్కొన్నారు. వీరిలో 56,601 మంది యాత్రికులు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ద్వారా 22,636 మంది యాత్రికులు హజ్ గ్రూప్ నిర్వాహకుల ద్వారా వెళతారని పేర్కొన్నారు.














