Skip to main content

Namaste NRI

కృష్ణ వ్రింద విహారికి ముహూర్తం ఖరారు

నాగశౌర్య కథానాయకుడిగా ఐరా క్రియేషన్స్‌ పతాకంపై అనీష్‌ ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కృష్ణ వ్రింద విహారి. షిర్లే సెటియా కథానాయిక. కుటుంబ వినోదంతో కూడిన చిత్రమిది. నాగశౌర్య భిన్నంగా, సరికొత్త పాత్రలో ఇందులో కనిపిస్తారు. ఒక పాట మినహా చిత్రీకరణ దాదాపుగా పూర్తయిందని సినీ వర్గాలు తెలిపాయి. సీనియర్‌  నటి రాధిక ముఖ్య భూమిక పోషిస్తుండగా, వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఉషా మూల్పూరి నిర్మిస్తున్నారు. శంకర్‌ ప్రసాద్‌ మూల్పూరి సమర్పకులు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకంటున్న ఈ సినిమా ఏప్రిల్‌ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్‌, కూర్పు : తమ్మిరాజు, కళ: రామ్‌కుమార్‌, సంగీతం: మహతి స్వరసాగర్‌,  సహ నిర్మాత: బుజ్జి.

Social Share Spread Message

Latest News